Wednesday, March 6, 2024

LONG DRIVE

Once upon a time there is a planet name as animal planet in that planet there are two friends are living one is Ravi he is a elephant and other one is Rahul he is a ant one day that is ravi's birthday Rahul gifted a bike to Ravi he said thank you my friend let's go this is our first drive in this bike on my birthday come on so they are gone to a drive to mountain when they are going up to the mountain from another side there is a truck coming they don't know so it's a big accident ravi leg is broken and he is in critical condition suddenly Ravi get up and ask about Rahul  and Rahul came near to Ravi and tell I am okay my friend Ravi ask how it's a big accident how you alive with no small scratches on your head  my dear friend said Rahul I told to you to wear helmet but you are not listening my words and your started the long drive but I wear my helmet so I don't have any small scratche also on my head Ravi said Ho sorry man.

                               Written by:DVV

బంజారాల చరిత్ర

బంజారాల చరిత్ర 

చరిత్రను తొక్కేస్తే కనపడదు, వెలికితీయలేరు అనుకుంటున్నారా?

అసలు బంజారాలు ఏవరు ? బంజారాల పూర్వ వృత్తాంతము ఏమిటి ? భారతదేశాన్ని, భారతీయ సంస్కృతిని కాపాడటంలో బంజారాల పాత్ర ఏమిటి ? భారతదేశ స్వాతంత్ర్యంకై, భరతమాత విముక్తికై బంజారాలు చేసిన పోరాటం, త్యాగం ఏమిటి ? వారసులుగా బంజార సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్ల పరీరక్షణ కోసం మనం చేయాల్సిన కర్తవ్యం,మన బాధ్యత ఏమిటి ?

భారత దేశ చరిత్ర సంస్కృతి ఒక వైపు, బంజారాల చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు ఒక వైపు. ప్రధానంగా బంజారాల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడిపడిన అంశం. బంజారాలు అఖండ భారతదేశం మొత్తంలో నివసిస్తూ తమకంటూ ఒక విశిష్టమైన ఆచార సంప్రదాయాలను కలిగి ఉండటమే కాకుండా ప్రత్యేకమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నారు. బంజారాల వేష - భాషలు, సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇతరుల కంటే భిన్నమైనవి మరియు ప్రాచీనమైనవి. ప్రతి జాతికి, తెగకు, కులానికి పురాణగాథలు ఉంటాయి. లంబాడి తెగకు కూడ వారి మూల పురుషుని పుట్టుకను గురించి, వృత్తి పుట్టుకను గురించి, వంశాల పుట్టు, పూర్వోత్తరాలు గురించి అనేక రకాల పురాణ గాథలున్నాయి. ఇవి ఎక్కువగా మౌఖిక రూపంలోనే ఉన్నాయి.

భారతదేశంలోని బంజారాలు విశ్వవ్యాప్తంగా కనిపిస్తున్న 'రోమాజిప్సిల' సగోత్రులు. వీరి స్వస్థలం రాజస్థాన్ ఐనా వీరు ఈనాడు దాదాపు అన్ని రాష్ట్రాలల్లో విస్తరించి ఉన్నారు. కానీ, ఉత్తర,పశ్చిమ,దక్షిణ భారతదేశంలో అధికంగా ఉన్నారు. వీరీది ఒక బహుజన సమాజం. బంజార అన్నది కులం కాదు, సామాజిక సమూహం (Social Group). వారిలో గోర్ బంజారాలు రాజస్థాన్ లోని రసపుత్రులతో సగోత్ర సంబందం కలవారని రక్తపరీక్షలు కూడా నిరూపించాయి.

బంజారాలు జన్మతః బలశాలులు, పరాక్రమవంతులు అయినందువల్ల భారతదేశంలో విదేశీ దండయాత్రలను వీరోచితంగా ఎదుర్కోన్నారు. గ్రీకువీరుడు అలెగ్జాండర్ ను ఎదుర్కోవడంలో పంజాబ్, సింథ్ ప్రాంతంలోని బంజారాలు అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించారు. భారతదేశంలో రసపుత్రులకు (రాజపుత్రులు) జన్మభూమియైన రాజస్థాన్ వీరగాథల పురిటిగడ్డ. మాతృభూమి సంరక్షణలో ప్రాణాలను తృణప్రాయంగా బలిపెట్టిన మహావీరులు రాజపుత్రులు. ఈ రాజపుత్ర వంశానికి చెందిన వీరజాతి నేటి సంచార జాతీయైన బంజారాలు. వీరినే వివిద రాష్టాల్లో 'సుగాలి' 'లంబాడీ' 'బంజార' అనే వివిధ రకాల పేర్లతో కూడా పిలుస్తున్నారు.

పాండవ వీరవంశం అభిమన్యునితో అంతరించిపోకుండా శ్రీ కృష్ణ భగవానుడు కాపాడాడు. ఉత్తర గర్భంలో పరీక్షిత్తును రక్షించాడు. ధర్మరాజు తరువాత పరీక్షిత్తు పట్టాభిషిక్తుడయ్యాడు. పరీక్షిత్తు కోడుకు జనమేజయుడు. అతనికి వ్యాస శిష్యుడైన వైశంపాయనుడు మహాభారత గాథను సవిస్తరంగా వివరించాడు. పాండవులు మహాప్రస్థానం చేసే నాటికి కలియుగం వచ్చేసింది. పరీక్షిత్తు- జనమేజయుల వంశంలోని వాడే మహావీరుడు పృథ్వీరాజ్ చౌహాన్. భారతదేశాన్ని, భారతదేశ సంస్కృతిని కాపాడటంలో ప్రాణాలోడ్డినా శూర శికామణీ పృథ్వి రాజ్ చౌహాన్ రసపుత్ర వీరుడు. అలాగే తరవాతి కాలంలో మొగలాయి చక్రవర్తులపై తిరుగుబాటు చేసిన రసపుత్ర వీరుడు రాణా ప్రతాప్ సింగ్  రసపుత్ర వీరుడు. ఈ మహవీరుల సంతతి వారు బంజారాలు. 
బంజారాలలో నాలుగు క్షత్రియ వర్ణములు ఉన్నాయి. 1.రాథోడ్ వంశం 2.చౌహాన్ వంశం 3. పవార్ వంశము 4. జాదవ్ వంశం.

5వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు బంజారాలు అఖండ భారతావనిని పరిపాలించిన కాలమును " రాజపుత్ర యుగం" అంటారు. ఉత్తర భారతమును బంజారాలు సుమారు 600 సంవత్సరములు ఏకఛత్రాధిపత్యముగా పరిపాలించారు. ఆనాడు ఘూర్జరులు, పాలమారులు, సోళంకులు, బుందేలులు, కాళచూరులు మొదలగు రాజ్యములన్నియు బంజారాలవి. వీరు బంజారాలే అని తెలుపుటకు ఉదాహరణ : ఈనాటి వరకు బంజార పురుషులు, స్త్రీలు ఆ పేర్లతోనే పిలువబడుతున్నారు. ఉదాహరణకు బుందేలులు-
బుదేలా; పాలమారులు- పేమ్యా: కాళచూరులు- కాళీయ, ఘూర్జరీ- గుజరి, శోళంకులు- సోమ్లా, సోమ్లి,సాలి.

11వ శతాబ్దంలో ఢిల్లీని పాలిస్తున్న పృథ్వీరాజ్ చౌహాన్ గారి చేతిలో 16 సార్లు ఓటమిని చవిచూసిన కాబూల్ ను పాలించుచున్న మహమ్మద్ ఘోరీ, 17 వ సారి జరిగిన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహన్ మహమ్మద్ ఘోరీ చేతిలో ఓడిపోతారు. రాజకాంక్షతో యుద్ధనీతిని మరచి మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ ని బంధీని చేసి చిత్రహింసలతో రెండు కళ్ళను తీయించి 9 మణుగుల ఇనుప గోలుసును మెడకు, కాళ్ళకు, చేతులకు వేసి చీకటి గుహాలో పడేస్తాడు.
 
ఆ విషయం పృథ్వీరాజ్ గురువు,మంత్రియైన చాంద్ బద్దాయికి (భట్) తెలుస్తుంది. అతను చాలా దుఃఖితుడై అతి కష్టము మీద కాబూల్ చేరుకొని ఘోరీని దర్శిస్తాడు. తన గురించి తెలిపి, తన చివరి రోజులలో తన రాజును, శిష్యుడిని దర్శించుకొని తనువు చాలిస్తానని ప్రార్థిస్తాడు. అప్పుడు రాజు కోంత సైన్యమును తన వెంట ఇచ్చి చూసి రమ్మని ఆజ్ఞాపిస్తాడు. చాంద్ బద్ధాయిని బంజారాల "ఢాడి" అంటారు. 'ఢాఢీ' అనగా తెలుగులో 'భట్ రాజులు' అంటారు. ఇతను 'ఢాడీ' అవుట వలన రాజును గౌరవంగా దూరం నుండే పోగుడ్తూ మహారాజా...పృథ్వీరాజా... అని పిలిచాడు. చీకటి గుహలో తోమ్మిది మణుగుల ఇనుప గోలుసుతో బంధించబడి ఉన్న పృథ్వీరాజ్ ఈ శబ్దములను విని ఎవరూ? అని జవాబిచ్చాడు. నేను, తన గురువు చాంద్ బద్ధాయిని అని చెప్పిన వెంటనే గురువునకు నమస్కారం చేయు ఉద్రేకముతో తన రెండుచేతులు పైకెత్తి నమస్కరించబోయాడు. అంతలో ఆ తోమ్మిది మణుగుల ఇనుప గోలుసు పఠపఠమని విరిగిపోయింది. ఈ దృశ్యమును చూసిన రాజ భటులు మహమ్మద్ ఘోరీతో చెప్తారు. అప్పుడు ఘోరీ తోమ్మిది తోమ్మిది 18 మణుగుల గోలుసు వేయమని ఆజ్ఞాపిస్తాడు. అది విని చాంద్ భట్ గారు చాలా దుఃఖితుడౌతాడు.

 ఘోరీ, చాంద్ బద్ధాయిని ఉద్దేశించి మీ రాజు అంత బలశాలియా ?  అని ప్రశ్నిస్తాడు. చాంద్ భట్ గారు తమ రాజు యొక్క బల, పరాక్రమముల గూర్చి చాలా విషయములు తెలుపుతాడు. రాజులు, యోధుల బలపరాక్రమములు చూడుట ఒక వినోదముగా భావించేవారు. కావున మీ పృథ్వీరాజు ద్వారా మాకు ఎటువంటి విద్య చూపిస్తావు అనీ ప్రశ్నించారు.

చాంద్ భట్ గారు, తన ఉపాయంతో పృథ్వీరాజ్ గుడ్డివారు కదా అతని ద్వారా శబ్ధభేరి విన్యాసం ప్రదర్శింపచేస్తాను అన్నారు. రాజుగారితో ఒక సభను ఏర్పాటుచేసి, ఆ సభ మధ్యలో ఒక స్తంభమును నాటించి ఆ స్తంభము చివరన గంట కడుతారు. ఆ సభలో పృథ్వీరాజ్ ని రప్పించి, చాంద్ బద్ధాయి పృథ్వీరాజ్ చౌహాన్ తో ...స్తంభమునకు కట్టిన గంటలు ఐదు అడుగుల ఐదు అంగుళాలు ఎత్తులో ఒక కోణంలో బాణాన్ని వదిలిన గంట తెగిపోగలదు అని చెప్తారు. అదే ప్రకారం పృథ్వీరాజ్ బాణమును వేస్తారు. వెంటనే గంట త్రేగి క్రింద పడుతుంది. ఈ దృశ్యమును చూసిన మహమ్మద్ ఘోరీ గద్దె మీద నుండి గట్టిగా “శభాష్ శభాష్" అంటారు. వెంటనే వేరోక బాణమును తీసి శబ్దమునకు సంధించి వదులుతాడు. ఆ బాణమునకు ఘోరీ తల ఎగిరి పడుతుంది. ప్రజలంతా హాహాకారములతో ఘోరీవున్న ప్రదేశమునకు వెళ్ళిపోతారు.

చాంద్ బద్ధాయి, పృథ్వీరాజ్ గారికి ఈ విషయంను తెల్పుతూ వారు మనల్ని ఎలాగైనా చంపేస్తారు అంటారు. వెంటనే పృథ్వీరాజ్ గారు, మనం వారిచేతులలో మరణించుటకన్న మన చేతులతో వీరస్వర్గం పోందడం ఉత్తమం అని అంటాడు. మీరు ఖడ్గముతో నా కంఠమును ఖండించండి. నేను మీ గోంతు పిసుకుతాను అంటాడు. ఆ వెంటనే చాంద్ బద్ధాయిగారు పృథ్వీరాజు శిరస్సును ఖండించడం, పృథ్వీరాజ్ చాంద్ బద్ధాయిగారి గోంతును పిసకటం జరుగుతుంది. ఈ దృశ్యాన్ని చూసి మహమ్మద్ ఘోరీని చూడబోయిన ప్రజలు వారిని బంధించి చంపేయండి అని చెప్పేలోపు వారిద్దరు చనిపోయి ఉంటారు. ఈ విధంగా ఒక గ్రుడ్డివాడైనా పృథ్వీరాజ్ చౌహాన్, ఒక ముసలివాడైనా చాంద్ భట్ లు కలిసి మహమ్మద్ ఘోరిని చంపగలిగారు. “ఈ గోరవట్ " జాతివున్న మనకు చాలా ప్రమాదం అని, ఆ జాతిని సర్వనాశనం చేయండి అనీ ఆ తరువాత రాజు ఆజ్ఞాపిస్తే... బంజారాల మాన, ప్రాణాలను అమానుషంగా, కర్కషంగా తీయుట వలన నిరాయుధులైన బంజారాలు అడవుల పాలైనారు.

5 వ శతాబ్దం నుండి11 వ శతాబ్దం వరకు మొత్తం ఉత్తర హిందూస్థాన్ ను ఏకధాటిగా పరిపాలించిన వారిలో చివరి హిందూ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో వీరి సైన్యం మూడు భాగాలుగా విడిపోయి , ఒక భాగం రాజస్థాన్ కోటలలోను, రెండవ భాగం అడవుల పాలై, మరియొక భాగం ఇతర దేశాలకు తరలిపోయారు. రాజస్థాన్ కోటలలో ఉన్న వారే క్షత్రియులుగా (రాజపుత్రులు) గుర్తించబడ్డారు, అడవుల పాలైన వారు బంజారాలు. పరదేశములకు పోయినవారినే "జిప్సిలు" లేక "రోమా బంజారాలు" అంటారు. వీరు 63 దేశాలలో విస్తరించి ఉన్నారు.

అడవులకు పోయిన వారిలో కోంతకాలమునకు చిథోడ్ కోటను నిర్మించుకొని రాజ్యమును పాలించిన వారిలో రాణా  ప్రతాప్ సింగ్ ముఖ్యులు. రాణా ప్రతాప్ సింగ్ ,  వీరు అక్బర్ కాలంలో యుద్ధాలు చేసి చేసి వారి ధాటిని తట్టుకోలేక అడవుల పాలై, హల్దిఘాట్ అనే ప్రదేశములో ఒక శపథం చేస్తారు. ఈ భారతదేశమునకు "సర్వ స్వాతంత్ర్యం" వచ్చేట్టు చేసేంతవరకు చిథోడ్ కోటలో కాలు పెట్టమని, చుట్టూ గుడిసెలలో కాపురం చేస్తాం, కఠిన నేలపై పడుకుంటాం, మట్టి పాత్రల్లో భోజనం చేస్తామని ప్రమాణం చేస్తారు. అదే ప్రకారం బంజారాలు చదువు, సంధ్యలు లేక స్వాతంత్ర్యము వచ్చు వరకు పైన తెలిపిన విధంగా జీవనం కోనసాగిస్తూ వచ్చారు. 

తరతరాలుగా మహమ్మదీయులతో పోరాడిన వీర జాతీ రాజపుత్రులు కాలక్రమేణ మహమ్మదీయుల క్రౌర్యాలకు, దాష్టికాలకు తట్టుకోలేక కాందిశీకులై నలుదిక్కులకు చెదిరిపోయారు. పై నాలుగు వర్ణములలోను మూడు వర్ణముల వారు వారి జనాభాను బట్టి నిలద్రొక్కుకున్నారు. క్షత్రియ వర్గం మాత్రం 80 శాతం నశించి పోయినది. ఎందుకనగా వీరి పని ఎల్లప్పుడూ యుద్ధాలు చేయుట. అందులో ప్రాణ నష్టం జరుగుట, కోందరు రాజ్యాలు వదిలి వారి ప్రాణ రక్షణార్థమై ఎవ్వరికీ అందనటువంటి అడవులకు పారిపోవటం. అక్కడ వారికి ఎటువంటి వసతులు దోరకక ఆర్థికంగా, వైజ్ఞానికంగా, రాజకీయంగా చితికిపోయి ఆఖరికి వారెవరో వారికే తెలియకుండా బ్రతుకుతున్నారు.

లంబాడిలు శారీకంగా భారీ మనుషులు. దృఢమైన శరీరం కలిగి ఎత్తుగా ఉంటారు. వారిని చూసిన బ్రిటిష్ ప్రభుత్వం "Long Bodies"అని పేరు పెట్టింది. దీని నుండే "లంబాడి" అనే పేరు వచ్చిందంటారు.   వీరు అత్యంత ప్రమాదకర గిరిజనులు అని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం "Criminal Tribe Act -1871 " అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ఉద్ధేశం లంబాడీలు బ్రిటిష్ సైనికులను చంపారు, కావున లంబాడీలు నేరస్థులు. కావున వారిని బంధిచాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశిస్తుంది. అప్పుడు బ్రిటిష్ వారు తండాలపై పడడంతో, లంబాడీలు అడవులలో పారిపోయారు. అలా బ్రిటిష్ వారి నుండీ పారిపోయిన బంజారాలు అడవులలో సంచార జీవనం కోనసాగించి, సంచార తెగగా పిలవబడుతున్నారు. 

బ్రిటిష్ వారు వచ్చినప్పుడు వారిని తరిమి వేయుటకు అమర్ సింగ్ రాథోడ్ మధ్య భారతంలో స్వతంత్ర్య పోరాటమును సాగించాడు. జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరియసి ! ఎవరైతే మాతా‌, పిత,గురువు, దైవం, మాతృ భూమిపై భక్తి, విశ్వాసములు కలిగి ఉంటారో వారు తమ మాతృ భాషను కూడా గౌరవిస్తారు. మాతృభూమిపై గౌరవముండి శత్రువుల నుండి ఎవరైతే రక్షించుకుంటారో తమను తాము రక్షించిన వారు అవుతారు. భరత ఖండములో జన్మించిన బంజారాలు తమ మాతృభూమి రక్షణార్థమై తమ సర్వస్వములను వదులుకోని, ఎన్నో యుద్ధాలు చేసి, శత్రువులను ఎదురించి ఆఖరకి తమ స్థానబలములనే వదులుకోని అడవుల పాలైనారు. ఈ విధంగా బంజారాలు దేశ సేవకై పాటు పడుతూ వస్తున్నారు. ఆనాడు దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజాతి నిన్నమొన్నటి వరకు నిలువ నీడ లేకుండా సంచార జాతీగా బ్రతికారు.

లంబాడీలది ప్రాచీన సంస్కృతి. బంజారాలు అడవుల పాలైనా తరువాత పశువుల పోషణ వీరి జీవన ఆధారం. పూర్వం తండాలో లంబాడీలు నైతికవిలువలు, మానవీయ విలువలు పాటించి సంస్కృతిని పరిరక్షించుకున్నారు. కానీ బంజారాల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్ల గురించి ఏ మత గ్రంధాలు, ఏ చరిత్ర కారులు, ఏ పుస్తకాలలో రాయలేదు. లంబాడీ పూర్వికులు ఉండడానికి జనావాసాలకు దూరంగా తండాలను నెలకొల్పి లంబాడి సంస్కృతిని కాపాడేలా చేసారు. అంటే బయట ఎంత పెద్దవారైనా‌, ఎంత గోప్పవారైనా తండాలో వచ్చి ఎలాంటి కోత్త పద్ధతులు, సిద్ధాంతాలు,లంబాడీలపై రుద్దడానికి వీలులేదు. లంబాడీలలో పుట్టినప్పటి నుండీ చనిపోయేవరకు సంస్కృతీ, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, జీవనవిధానం,పెళ్లి,చావు అన్ని ప్రత్యేకమైనవే. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో మన సంస్కృతి,మన బాషా కనుమరుగయే ప్రమాదంలో ఉన్నాయి. కావున మన సంసృతి, సంప్రదాయాలను రక్షించడం, పరిరక్షించడం మన అందరి బాధ్యత.
విజయ్ కుమార్ జాదవ్ బదావత్ 
రాజు నాయక్ డుంగావత్
D.V. విజయ్ బాబు రాథోడ్
D.V. జై కాశ్వీ రాథోడ్ 



పోటీ పంజరంలో పిల్లలు

పోటీ పంజరంలో పిల్లలు

నాన్నా....నేను మారం చేయను
అమ్మా....నిన్ను విసిగించను
మీకు లాగే ఒత్తిడి లేకండా చదువుకుంటా
మీ స్ఫూర్తితో జీవితంలో నిలదొక్కుకుంటా..ఒట్టు.
నాడు..
మీరేమో ఆడుకుంటూ పాడుకుంటూ కష్టనష్టాలను ధైర్యంగా జయించి చదువుకున్నారు.
నేడు..
నేను అడగకుండానే ఖరీదైన కార్పొరేట్ విద్యను కొనవ్వగల్గుతున్నారు.
నా ప్రమేయం లేకుండానే ఈపైశాచిక పోటీ ప్రపంచంలో నను నిలిబెట్టారు.
కార్పొ||రేట్|| పంజరంలో నన్ను ఇరికించేశారు.
ఆర్థికంగా మీరూ ఇరుకున పడుతున్నారు.
మీరు నలిగిపోయి నన్ను ఉంచిన ఈ ఖరీదైన పంజరంలో ...
నా బాల్యం హరించుకుపోతోంది..
నా నైపుణ్యం నశించిపోతోంది..
ఆత్మవిశ్వాసం అంతిమదశకు చేరుతోంది..
నాలో అసహనం అంతకంతకూ పెరుగుతోంది.
ఈ అవలక్షణాలన్నీ నాలో ఉన్నాయని మననం చేసుకున్నప్పుడు...
మీకు లాగ ధైర్యంగా జీవితాన్ని జయించలేమోనని..
మీకు లాగ భావితరాలకు ఖరీదైన చదువును కొని ఇవ్వలేనన్న నమ్మకం సన్నగిల్లుతోంది..జీవితమంటే భయమేస్తోంది..మరణం వైపు నన్ను నడిపిస్తోంది.||
                          
     మిత్రులారా పై కవితను ఓ కార్పొరేట్ స్కూల్ లో చదువుతున్న ఓ విద్యార్థి నాతో పంచుకున్న తన ఆందోళన ఆధారంగా రాసింది. 
             

LONG DRIVE

Once upon a time there is a planet name as animal planet in that planet there are two friends are living one is Ravi he is a elephant and ot...