Showing posts with label education #chaildeducation/corporate education/hostel education/competitive education #######child/children's/small kids/rich kids/consisted space education system///##&&@@. Show all posts
Showing posts with label education #chaildeducation/corporate education/hostel education/competitive education #######child/children's/small kids/rich kids/consisted space education system///##&&@@. Show all posts

Wednesday, March 6, 2024

పోటీ పంజరంలో పిల్లలు

పోటీ పంజరంలో పిల్లలు

నాన్నా....నేను మారం చేయను
అమ్మా....నిన్ను విసిగించను
మీకు లాగే ఒత్తిడి లేకండా చదువుకుంటా
మీ స్ఫూర్తితో జీవితంలో నిలదొక్కుకుంటా..ఒట్టు.
నాడు..
మీరేమో ఆడుకుంటూ పాడుకుంటూ కష్టనష్టాలను ధైర్యంగా జయించి చదువుకున్నారు.
నేడు..
నేను అడగకుండానే ఖరీదైన కార్పొరేట్ విద్యను కొనవ్వగల్గుతున్నారు.
నా ప్రమేయం లేకుండానే ఈపైశాచిక పోటీ ప్రపంచంలో నను నిలిబెట్టారు.
కార్పొ||రేట్|| పంజరంలో నన్ను ఇరికించేశారు.
ఆర్థికంగా మీరూ ఇరుకున పడుతున్నారు.
మీరు నలిగిపోయి నన్ను ఉంచిన ఈ ఖరీదైన పంజరంలో ...
నా బాల్యం హరించుకుపోతోంది..
నా నైపుణ్యం నశించిపోతోంది..
ఆత్మవిశ్వాసం అంతిమదశకు చేరుతోంది..
నాలో అసహనం అంతకంతకూ పెరుగుతోంది.
ఈ అవలక్షణాలన్నీ నాలో ఉన్నాయని మననం చేసుకున్నప్పుడు...
మీకు లాగ ధైర్యంగా జీవితాన్ని జయించలేమోనని..
మీకు లాగ భావితరాలకు ఖరీదైన చదువును కొని ఇవ్వలేనన్న నమ్మకం సన్నగిల్లుతోంది..జీవితమంటే భయమేస్తోంది..మరణం వైపు నన్ను నడిపిస్తోంది.||
                          
     మిత్రులారా పై కవితను ఓ కార్పొరేట్ స్కూల్ లో చదువుతున్న ఓ విద్యార్థి నాతో పంచుకున్న తన ఆందోళన ఆధారంగా రాసింది. 
             

LONG DRIVE

Once upon a time there is a planet name as animal planet in that planet there are two friends are living one is Ravi he is a elephant and ot...